సప్తగిరి సుందరా ..... దివ్య శుభ మందిరా.....
సప్తగిరి సుందరా … దివ్య శుభ మందిరా .....
పాహి శుభ కరా .... పాహి భవ హరా ....
దయతు నను కావరా ..... || స ||
కొండపై నిండుగా వెల సేవా శ్రీ హరీ
శుభములే కోరుతూ వేడె నురా మరి మరీ
కరు ణించరా దీవించరా .....
శుభ చరణ స్మరణ హర శ్రీ వేంకటా రమణా || స ||
శ్రితజన పాలకా … .. పద్మా వతీ నాయకా
ఇహ పర దాయకా.... నెర వేర్చరా కోరికా
ఇలా పోషకా ...... శుభ కారకా .......
కరుణించు శౌరి హరి మాం పాహి గిరి ధారి || స ||
గుడి దరీ చేరితీ ..... దయ చూపరా శ్రీ పతీ
కరుణ నే కోరితీ శుభ చరణమే వేడితీ
నెర నమ్మితీ సేవించితి పర దాత లోక హిత
మాం పాహి శ్రీ రమణా || స ||
No comments:
Post a Comment