ఆది పూజాక్లు స్వామివి నీవే
ఆదరించు మా దైవము నీవే
యుగ యుగాలకు కర్తవు నీవే
ఆనంద తేజా ఓ విఘ్నరాజ || అది ||
మూడు జగములకు మూలము నీ వని
మోదము గూర్చే మోదక ప్రియుడని
త్రికరణ శుద్ధిగ ముచ్చటింతు నయ్యా
మూషిక వాహన మోక్ష మీయరా || అది ||
జననీ జనకుల పెన్నిధి కన్నా
జయము నిచ్చే తీర్థము లేదని
జ్ఞాన ఫలమునూ పొందినావయా
సురగన వందిత లోక పూజితా || అది ||
అమరుల గెలువ అమిత భక్తితో
ఆత్మ లింగమును వరముగ పొందిన
రావణ కార్యము భగ్నము చేసిన
ఇలలో వెలిసెను రామేశ్వరమూ || అది ||
8.శ్రీ గణ నాయక నమో నమో
శ్రీ గణ నాయక నమో నమో
సిద్ధి వినాయక నమో నమో
ఈశ్వర పుత్రా నమో నమో
విఘ్న వినాశక నమో నమో
మూషిక వాహన నమో నమో
మునిజన వందిత నమో నమో
పార్వతి నందన నమో నమో || శ్రీ గణ
మోదక హస్తా నమో నమో
చామరం కర్ణ నమో నమో
ఏకదంతా నమో నమో
ఇక నిరంజనా నమో నమో
ఆనంద రూప నమో నమో
ఆశ్రిత రక్షక నమో నమో
సర్వ జన స్తుత నమో నమో
సర్వ శుభ ప్రద నమో నమో
9.శ్రీ మహా గణపతి సిద్ధి గణపతి
శ్రీ మహా గణపతి సిద్హి గణపతీ
భావింతును నిన్నే బహు రూప గణపతీ || శ్రీ ||
గణణ మెలినేని మహిమలు గణపతీ
గణు తింతును ప్రణు తింతును
గణపతి గణపతి గణపతీ
శ్రీ మహా గణపతి సిద్హి గణపతీ || శ్రీ ||
వక్ర తుండ గణపతి బాల గణపతీ
చింతామణి గణపతి చిప్ర గణపతీ
హరిద్రా గణపతి అర్క గణపతీ
వల్లభ గణపతి సాక్షి గణపతీ
గణపతి గణపతి గణపతీ || శ్రీ ||
రత్న గర్భ గణపతి నృత్య గణపతీ
పంచమ గణపతి భక్త గణపతీ
ఉత్తండ గణపతి యోగ గణపతీ
ఉత్తేస్ట గణపతి ఊర్ధ్వ గణపతీ
హేరంబ గణపతి డూండీ గణపతీ
సంకట హర గణపతి శక్తి గణపతీ
రుణ మోచన గణపతి వీర గణపతీ
విఘ్నరాజా గణపతి విజయ గణపతీ
గణపతి గణపతి గణపతీ || శ్రీ ||
సిద్ది బుద్ది గణపతి ఆది గణపతీ
స్వస్తీక గణపతి ప్రణవ గణపతీ
ఫాల చంద్ర గణపతి మంత్రం గణపతీ
సింహాసన గణపతి తంత్ర గణపతీ
లంబోదర గణపతి లక్ష్మీ గణపతీ
వినాయక గణపతి వికట గణపతీ
ధూమ్ర వర్ణ గణపతి కపిల గణపతీ
శ్రీ విద్యా గణపతి సుముఖ గణపతీ
గణపతి గణపతి గణపతీ || శ్రీ ||
10.ఆది పూజకు స్వామివి నీవే
ఆది పూజకు స్వామివి నీవే
ఆదరించు మా దైవము నీవే
యు గ యుగాలకు కర్తవు నీవే
ఆనంద తేజా ఓ విఘ్న రాజా || అది ||
మూడు జగములకు మూలము నీ వే
మోదము గూర్చే మోదక ప్రియుడని
త్రికరణ శుద్ధిగా ముచ్చటింతు నయ్యా
మూషిక వాహనం ఆ మోక్ష మీయవా || అది ||
జనకుల పెన్నిధి కన్నా
జయము నిచ్చే తీర్థము లేదని
జ్ఞాన ఫలమును పొందినావయా
సురగుణ వందిత లోక పూజితా || అది ||
అమరుల గెలువ అమిత భక్తితో
ఆత్మ లింగమును వరంగా పొందిన
రావణ కార్యము భగ్నము చేసిన
ఇల లో వెలి సెను రామే శ్వరమూ || అది ||
No comments:
Post a Comment