పంచ ముఖీ గాయిత్రి మహా మాతవే
పంచముఖి గాయిత్రి మహా మతవే
జగదాంబా శ్రీ మాతా అవి నాశినీ
అవి నాశినీ మాతవే || పం ||
సహస్రాక్షి, సహస్ర రూపి సర్వ వ్యాపినే
వెలుగు చూపి నడిపించు సర్వ శక్తివే
మహా మాయ , మహా మోహ మంత్రం శక్తివే
దిక్కులన్నీ పాలించు దివ్య శక్తివే || పం ||
శంకు చక్ర, పరశుధారి సర్వ ధాత్రివే
ముల్లోక ముల నేలు విశ్వ వంధ్యవే
కామి తార్థముల నొసగు కల్పవల్లివే
కరుణించి కాపాడు కళ్యా ణివే || పం ||
వేద మాత దేవ దేవి సర్వ శ్రేష్టివే
కృపను జూపి దీవించు కమలాక్షివే
ప్రకృతి సౌందర్య అను భూతివే
సిరులన్ని కురిపంచు సావిత్రివే || పం ||
పంచముఖి గాయిత్రి మహా మతవే
జగదాంబా శ్రీ మాతా అవి నాశినీ
అవి నాశినీ మాతవే || పం ||
No comments:
Post a Comment