ధీరా గంభీరా జయ వీరా పరివారా
ధీరా గంభీరా , జయ వీరా పరివారా
శ్రీ కాత్యాయిని మంగళం || ధీ ||
వేద విధాయిని వేద స్వరూపిణి
మోదముతో మము కాపాడవా
రావా ఇక రావా , దయ లేదా మా మీదా
శ్రీ కాత్యాయిని మంగళం
ప్రాణుల కెల్లను , రాణివి నీవే
కరుణతో మమ్ము కాపాడవే
రాణి, శివ రాణి కల్యాణి , శర్వాణి
శ్రీ కాత్యాయిని మంగళం
శుభములు చే కూర్చు సౌ భాగ్య దాయిని
సువాసిని పూజ సుహాసిని
శౌరి, శ్రీ గౌరీ, హ్రీంకారీ , క్లింకారి
శ్రీ కాత్యాయిని మంగళం
మంచు కొండలపై నుండు మహేశ్వరీ
బ్రహ్మాండముల కెల్లా నీవే అండ
అండా , మా దందా, రాజా కొండా, నీ అండా
శ్రీ కాత్యాయిని మంగళం
ధీరా గంభీరా , జయ వీరా పరివారా
శ్రీ కాత్యాయిని మంగళం || ధీ ||
శ్రీ కాత్యాయిని మంగళం || ధీ ||
No comments:
Post a Comment