అమ్మల గన్నమ్మా మా వెలుగే నీవమ్మా
అమ్మ ల గన్నమ్మా మా వెలుగే నీ వమ్మా
మా యింటి మంగళ గౌరి పసుపు కుంకుమ నీధమ్మా
ఈ పసుపు కుంకుమ నీకమ్మా || ఆ ||
ప్రకృతి వి నీవై నావూ తోలి శక్తి గ ఇల వెలిశావూ
ప్రతి తల్లిని నే నాన్నవూ మా అమ్మగా నిను మలిచావూ
నీ మమతల ఊయలలో మా కలతలు మరిపించావూ
ప్రాణి కోటికి నీడ చేర్చి జగతిని లాలించావూ
ఈ జగతిని లాలించావూ || ఆ ||
నిను మది లోనే నిలి పాను నీ శరణము నే కోరా నూ
అమ్మగ నిను కన్నాను మా అమ్మవు నీ వన్నాను
ఈ ప్రకృతి నీ వడిలో అణు అణువునా చూశాను
నీవు లేని జగమే లేదని నిను నే పూజించాను || ఆ ||
ఇహ మై నీ రూపం అను రాగా లకు అది నిలయం
పరమై నీ తేజం కైలాసపు మణి దీపం
నీ కరుణా దృక్కుల తో మా వ్యథలే తీర్చావూ
దేవ మానవ సంగమ మై ఇహ పర మై వున్నావు || ఆ ||
మా వెలుగే నీ వమ్మా
No comments:
Post a Comment