కృష్ణమ్మా తీరాన కీలాద్రి శిఖరాన
కృష్ణమ్మ తీరాన కీలాద్రి శిఖరాన
కళ్యాణి శ్రీ కనక దుర్గా …
కళ్యాణి శ్రీ కనక దుర్గా …
కరుణించి మమ్మేల రావా ఈవేళ
కాదంబినీ కనక దుర్గా || కృ ||
దుర్గుణు డను రాక్షసుడు దుష్టాత్ముడై చెలరేగి పోగా
శిష్టులను బ్రోవా కాపాలియే కదలి రాగా
ఇంద్ర కీలాద్రి పై దుష్ట దమ నాద్రి యై
తాండ వించగ కాళి మాతా
దుర్గా సురుని శిరము వ్రయలై కూల
దుర్గ యై వెలసింది మాతా || కృ ||
లోక కంఠకు డా రావణా సురుని కూల్చి
రఘురాము డర్పించె నిన్నూ
లోక రక్షణ సేయ లోక మాత వై నీవు
జయము నిచ్చి నా వమ్మా...... మున్నూ || కృ ||
ఇచటనే బ్రహ్మ సత్య లోకము గొనెను
శ్రీ కంఠు కరుణావ రావా
ఆది శంకరు డిచట శ్రీ చక్రం తోడ
పూజించె నిను మాన సాన || కృ ||
వచ్చు నని పివత్సుడని పార్ధుడే ఇట నిలచి
రుద్రాక్ష మును దాల్చి రుద్రునే కొలిచి ,
పాశు పతమును బొందె పార్ధుడే శిఖరాన
పాశు పతమును బొందె పార్ధుడే శిఖరాన
భువనైక నీ దయను చేసి || కృ ||
No comments:
Post a Comment