10. సౌ భాగ్యా లక్ష్మీ రావమ్మా .....మ్మా… || సౌ ||
సౌ భాగ్యా లక్ష్మీ రావమ్మా
అమ్మ …సౌ భాగ్యా లక్ష్మీ రావమ్మా || సౌ ||
నుదుట కుంకుమ రవి బింబముగా
కన్నుల నిండుగా కాటుక వెలుగు
కాంచన హారము గళమున మెరియగ
పీతాంబరముల శోభలు నిండగ || సౌ ||
నిండుగ కరముల బంగారు గాజులు
ముద్దు లొలుక పాదమ్ముల మువ్వలు
గల గల గల మని సవ్వడి చేయగ
సౌభాగ్య వతుల సేవలు నందగ || సౌ ||
నిత్యా సుమంగళి నిత్యా కళ్యాణి
భక్త జనులకు కల్పవల్లి
కమలాసన పై కరుణ నిండగా
కనక వృష్టి కురుపించగ రావా || సౌ ||
జనక రాజుని ముద్దుల కొమరిత
రవికుల సోముని రమణి మణివై
సాదు సజ్జ నుల పూజ లందు కొని
శుభములు దీవెన లీయగ ఇచ్చీ || సౌ ||
కుంకుమ శోభిత పంకజ లోచని
వెంకట రమణుని పట్టపు రాణీ
పుష్కలముగ సౌ భాగ్యము నిచ్చే
పూర్ణ మూర్తి మా యింట వెలసిన || సౌ ||
సౌ భాగ్యముల బంగరు తల్లీ
పురందర విఠలుని పట్టపు రాణి
శుక్ర వారము పూజ లందగ
సాయం సంధ్యా శుభ ఘడియ లలో || సౌ ||
No comments:
Post a Comment