ఎందెందు చూసిన అందందు నీవే
ఎందెందు చూసిన అందందు నీవే
నీవే జగదంబవు నీవేలే
తల్లి శ్రీ దేవి భూదేవియే మమ్ము కరుణించి కాపాడవే
ఆకులో ఆకువై , రెమ్మలో రెమ్మవై , పూవుల్లో పూవైతివే
తల్లి వెన్నెల నీవైతివే || ఎ ||
జీవమంతా నీవే , ప్రాణమంతా నీవే
దయ చూడవమ్మా అమ్మల గన్న యమ్మా
ఇలలో నీకన్నా వేరెవరమ్మా
కాపాడవమ్మా మా దుర్గమ్మ
అంబికా జగదంబికా కరుణించవే కాపాడవే
దయ చూడ రావమ్మా || ఎ ||
కాళరాత్రి నీవే, భద్ర కాళీ నీవే
సూర్య చంద్రులు నీవే, స్థితి లయములు నీవే
ఉరుము, మెరుపు లన్నీ నీ కరుణే లే
రాత్రి పగలూ నీ సృష్టే లే
రంజనీ రసరూపిణీ
నీ వల్లనే జగ మంతా ఆనంద మే నిండెనే || ఎ ||
సిద్ధి బుద్ది నీవే, భక్తి ముక్తి నీవే
వెలుగు, నీడ ని కరుణేలే
పాడి పంట లన్నీ నీ వరమేలే
పైరు పచ్చ లన్నీ నీ చలమేలే
శాలినీ వరదాయినీ
చిరు నవ్వులు, సిరి మువ్వలే
అందియలే మ్రోగెనే || ఎ ||
No comments:
Post a Comment