మా తల్లీ ఎల్లమ్మ మహిమలు గనరే
మా త ల్లీ ఎల్లమ్మ మహిమలు గనరే
మా పిల్లా , పాపల కరుణించి బ్రోచెనే
మా ఇంటి ఎల్లమ్మ నీవే నంటా
మా కంటి వెన్నలవూ నీవే నంటా
అమ్మల్లారా అయ్యల్లారా
మా తల్లి ఎల్లమ్మను కొలువగా రారా || మా ||
ఆషాడ మాసమున పూజలు చేసీ
ఆలయమున అభిషేకం చేసీ
దండాలమ్మా దండాలంటూ
చల్లంగా చూడంటూ మ్రొక్కెద మమ్మా || మా ||
పగడాల మా తల్లికి పందేలు వేసీ
ముత్యాల మా తల్లికి ముగ్గులు వేసీ
పల్లకిలో ఎల్లమ్మను ఊరేగించి
పసుపు, బండారు వాడి బియ్యం పోసి
కరుణించమ్మా కాపాడమ్మా
ఏటేట పండుగలు జరిపే నమ్మా || మా ||
పాలు, పెరుగు, నెయ్యి పరమాన్నాం చేసి
పాలకాయ నైవేద్యం పూజలు చేసి
కొంగు బంగారు నగలు వేయించేవూ
కోరికకు మణికంకణ అర్పించెదము
సర్వం నీది సకలం నీది
శరణం ఎల్లమ్మా శరణం తల్లీ || మా ||
కోటి సూర్య కాంతి లొలికే తల్లీ
కోవెలలో కొలువైన దేవత వమ్మా
తోలివేలు పోతరాజు వేషాలమ్మా
శివ భక్తుల చిందులేసు పూనుకాలమ్మా
భక్తుల్లారా బంధువుల్లారా
సవదత్తి ఎల్లమ్మను చూతము రారా || మా ||
నాగ స్వర సరిగమలు నాద మూదరా
నాగమ్మ పడగా విప్పి నాట్య మాడగా
నందన వన బృందావన కాంతులొలుకగా
మా తల్లీ ఎల్లమ్మకు వేడుకలు జరగగా
శరణం తల్లీ శరణాలమ్మా
శరణు శరణు శతకోటి దండాలమ్మా || మా ||
No comments:
Post a Comment