బెజవాడ కనక దుర్గమ్మా
బెజవాడ కనక దుర్గమ్మా .......తల్లీ
లోకాలకు రాణివి నీవమ్మా
సౌదర్య సుధల రాశివి నీవు
కారుణ్య గ్రంథా లహరివి నీవు || బె ||
ఓం కార రూపిణీ ఆత్మ స్వరూపిణీ
అమర పాలినీ శ్రీ చక్ర వాసినీ
విజ్ఞాన జ్యోతిని చూపమ్మా ....... మాకు
శ్యాoభవి శరణు శరణు నీకూ
ముక్తిని మాకు ఇవ్వమ్మా || బె ||
త్రి నేత్రా దారిణీ త్రి దేవా జననీ
పాప నివారిణి తేజో రూపిణీ
దీవెనలే కానుక లివ్వమ్మా ........ మాకు
శంకరి శరణు శరణు నీకూ
సద్భుద్ధి మాకు ఇవ్వమ్మా || బె ||
మహిష మర్దినీ మంగళ కారిణీ
సింహ వాహినీ సమరా వాసినీ
మోక్షానికి దారి చూపమ్మా .......మాకు
నారాయణి శరణు శరణు నీకూ
సంపత్తినే మాకు ఇవ్వమ్మా || బె ||
బెజవాడ కనక దుర్గమ్మా ....... తల్లీ
లోకాలకు రాణివి నీవమ్మా
సౌదర్య సుధల రాశివి నీవు
కారుణ్య గ్రంథా లహరివి నీవు || బె ||
No comments:
Post a Comment