జోల పాటనే పాడుతా జో జో నా తల్లీ
జో జో జో జో జో జో జో జో జో జో జో జో
జోల పాటనే పాడుతా … జో జో నా తల్లీ
లాలి లాలి లాలి జో జో జో || జోల ||
ఏడేడు లోకాలు ఎలే నా తల్లికీ జో జో
జగములు రక్షించే జగదేక లోక మాతకు
జగములు రక్షించే జగదేక లోక మాతకు
పదునాల్గు భువనాలను పాలించే మాతకు
పదునాల్గు భువనాలను పాలించే మాతకు
జోల పాడె ఈ వేళ ఎంతో మహత్తులు
జో జో జో జో జో జో జో జో జో || జోల ||
ఆకాశమే నారి చేసి బ్రహ్మాండమే ఊయలగా
సూర్యుని దాచేసి, చంద్రుని వింజామరగా, ఊపేటి
నా జన్మము ఎంత ధన్యమే నా తల్లీ
జోల పాడె ఈ వేళ ఎంతో మహత్తులు
జో జో జో జో జో జో జో జో జో || జోల ||
సంతోష సాగరాన ఓల లాడు నా తల్లీ
ఆనందిని, ఆహ్లాదిని ,సకల లోక రక్షణీ -జోజోజో జోజోజో
ప్రపంచాన్ని పాలించే , అలసి సొలసి నా తల్లీ
ఈ భక్తుల పరవ శాల జోల పాటా …
జో జో జో జో జో జో జో జో జో || జోల ||
No comments:
Post a Comment