నవోన్మేష శాలిని నవనీత హృదయినీ
నవోన్మేష శాలినీ నవనీత హృదయినీ
నవ దుర్గా రూపిణీ పాలయమాం
నవశక్తి కారిణి పాహిమాం || న ||
శైల పుత్రి , కాళ రాత్రి బ్రహ్మ చారిణీ
చంద్ర ఘంట స్కంద మాత కాత్యాయినీ
సిద్ది రాత్రి కుష్మాoడ మహా గౌరీ ….
జయ జయ చండాసుర భంజనీ || న ||
బ్రాహ్మణి శ్రీ లక్ష్మి రక్త దంతికా
శ్రీ దుర్గా చాముండి మహా కాళికా
శోక రహిత శివ దేవి కార్తికే
జయ జయ మహిషాసుర మర్దనీ || న ||
ప్రభామాయ జయ సూక్ష్మ త్రిశుద్ధా
నందిని సుప్రభ విజయా సిద్ధిదా
అనంత నామ ధారిణి అఖండ విభవ కారిణి
జయ జయ నవశక్తి స్వరూపిణీ || న ||
నవోన్మేష శాలినీ నవనీత హృదయినీ
నవ దుర్గా రూపిణీ పాలయమాం
నవశక్తి కారిణి పాహిమాం || న ||
పాహి మాం పాహి మాం
No comments:
Post a Comment