మధురలో మీనాక్షి మా తల్లి కరుణాక్షి
మదురలో మీనాక్షి మా తల్లి కరుణాక్షి
చల్లని చూపులే శ్రీరామ రక్షా ||మా ||
నిత్య సుమంగళి వై, రమణి కళ్యాణి వై
మా ఇంట నున్నావు, మా ఆడ పడుచు వై
చొక్కా నాథుడై స్వామి నీ పక్క నుండగా
జగమేలు తున్నావు జగతికే జననివై ||మా ||
సప్త మాతృక వై దుర్గా భవాని వై
ఏడేడు జన్మల మము గన్న తల్లి వై
ఆది మాత మా చెంత,, అండనే ఉండగా
దీవెన లీయమ్మ దేవేరి వై ||మా ||
No comments:
Post a Comment