లక్ష్మి రావే మా ఇంటికి క్షీరాబ్ధి పుత్రీ
లక్ష్మి రావే మా ఇంటికి క్షీరాబ్ధి పుత్రీ
వరలక్ష్మి రావే మా ఇంటికి || ల ||
లక్ష్మి రావే మా ఇంటికి ,
శాశ్వతముగా నీరాక చే,
సూక్ష ముగా, మోక్షమిచ్చే
సుందరీ ఓంకారి జననీ || ల ||
మాతా నీకు ప్రీతితో, ప్రఖ్యాతితో, సమర్పింతు నమ్మా
పసుపు కుంకుమ కస్తూరీ , కోర్కెతో కోరి జవ్వాది
అంకితముగా అగరు గంధము, నిత్యమూ సామ్రాణి ధూపము
మాతా నీకు ప్రీతితో , ప్రఖ్యాతితో సమర్పించ నమ్మా || ల ||
అందమైనా జామిపళ్ళూ
వివిధ మైనా నారింజాలూ
సతత ముగా కర్జూర ఫలములు
ఇంపైనా దానిమ్మ ఫలములు || ల ||
లక్ష్మి రావే మా ఇంటికి క్షీరాబ్ధి పుత్రీ
వరలక్ష్మి రావే మా ఇంటికి || ల ||
No comments:
Post a Comment