పలకు తేనెల తల్లి పవ లించెనూ
పలుకు తేనెల తల్లి పవళించెనూ
పలుకు తేనెల తల్లి పవళించెనూ
కలికి తనముల విభుని గలసినది గాన
కలికి తనముల విభుని గలసినది గాన || ప ||
నిగ నిగ ని మోము పై నెరులు గెలకుల జదుర
పగలైనా దాక చెలి పవళించెనూ
తెగని పరిణ తులతో తెల్ల వారిన దాకా
జగదేక పతి మనసు జట్టి గొనె గాన || ప ||
కొంగు జారిన మెరుగు గుబ్బ లోలయగ దరుణి
బంగారు మేనుపై పవళించె నూ
చెంగలువ కను గొనల సింగార ములు దొలక
అంగజ గురుని తోడ నలసినది గాన || ప ||
మురి పెంపు నటనతో ముత్యాల మలగు పై
పర వశంబున తరుణి పవళించెనూ
తిరు వేంక టాచలాధిపుని కౌగిట గలసి
అరవి రైనను జెమట నంటి నది గాన || ప ||
పవళించెనూ
No comments:
Post a Comment