వజ్ర ధారిణి సౌమ్య రూపిణి హే నమోస్తు
వజ్ర ధారిణి సౌమ్య రూపిణి తేనమోస్తు నమోస్తుతే
దివ్య రూపిణి లాస్య రంజిని తేనమోస్తు నమోస్తుతే
ఆది శక్తి, అళిక నేత్రి తేనమోస్తు నమోస్తుతే
వీర మాతే విజయ రూపిణి తేనమోస్తు నమోస్తుతే || వ ||
మోక్ష దాయిని మహా పూజ్యే మంగళ ప్రదాయినీ
మంజు భాషిణి, మధుర భాషిణి, మేరు మంధర వాసినీ
మంద గామిని, మృగాంత వదనే మహా లావణ్య శాలినీ
మేఘ శ్యామల మోహనా కృతె ముసలాయుధ ధారిణి || వ ||
విశ్వ వందే, విశ్వ ద్రూపి, యోమ మార్గ విశారదే
విశాలాక్షి వనిత రూపీ విశ్వ మాతె విమోచనే
వీణ ధారిణి, వివేక జ్ఞాని, విశ్వ విద్యా స్వరూపిణి
వీత రాగిణి, వేద సారిణి వాచ వాచ్యక స్వరూపిణీ || వ ||
జగ ద్వందే జగన్మాతే పర బ్రహ్మ స్వరూపిణి
మహా మాయే, మహా లక్ష్మి, మహా రౌద్రే మహోదరీ
సిద్ధి బుద్ది ప్రదే దేవి, భక్తి ముక్తి ప్రదాయినీ
లోక పావని, దుఃఖ నాశిని, సురముని జన సేవితే || వ ||
No comments:
Post a Comment