వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వైష్ణవి, భార్గవి, వాగ్దేవి త్రిగుణాత్మకే
వింధ్య, విలాసిని, వారాహీ త్రిపురాంబికే || వై ||
భవతి విద్యాందేహి, భగవతి సర్వాత్ర సాధకే
సత్యార్థ చంద్రికే
మాం పాహి మహనీయ మంత్రాత్మికే
మాం పాహి మాతంగి మాయాత్మికే
ఆపాత మధురము సంగీతము
అంచిత సంగాతమూ, సంచిత సంకేతమూ || వై ||
శ్రీ భారతీ క్షీర సంప్రాత్మమూ
అమృత సంపాతమూ , సుకృత సంపాతమూ
సరిగమ స్వర ధ్వని సార వరూధిని
సామసు నాద వినోదినీ …
మాం పాహి మకరంద మందాకినీ
మాం పాహి సుజ్ఞాన సంవర్ధినీ || వై ||
ఆలోచనా మృతమూ సాహిత్యమూ
సహిత హిత సత్యమూ.. శారదా సన్యమూ
సార స్వతా క్షర సారథ్యమూ
జ్ఙాన సామ్రాజ్యమూ జన్మ సాఫల్యమూ
సరస వక్షోభిణి, సారా లోచనీ, వాణి పుస్తక దారిణీ
వర్ణా లంకృత, వైభవ శాలీనీ , వార కవిత చింతామణి
మాం పాహి కాలోక్య సంధాయినీ
మాం పాహి శ్రీ చక్ర సింహాసినీ || వై ||
No comments:
Post a Comment