రక్షా బంధన మంటేనే సంతోషి
రక్షా బంధన మంటేనే సంతోషి మాత స్మరణం
రక్షా బంధన మంటేనే సంతోషి మాత స్మరణం
మాతా శరణం అంటేనే మోక్షపు ద్వారము దొరికెనూ || ర ||
అమ్మ అంటే సంతోషి రూపం
వారం అంటే సంతోషీ వారం
సంతోషీ వారం శ్రీ శుక్ర వారం
జగదంబను స్మరణం చేసిన
జయ మగు నే ప్రతి పని లోనా || ర ||
సోదర సోదరి ఆత్మీయతకూ
లోక రక్షకు - రక్ష ఇదే నని
అమ్మ సాక్షిగా రాఖీ కడుతూ
రక్షా బంధన సూత్ర మీదేనని
సంతోషి మాత స్మరణ ఇదేనని || ర ||
శ్రావణ పున్నమి వెన్నెలలో
ఉదయించెను మాతా సంతోషీ
సంతోషి మాత జననం, రక్షా బంధన స్మరణం
రక్షా బంధన ఫలితముగా
సుఖ, శాంతులు విరి చేను జగమంతా || ర ||
రక్షా బంధన మంటేనే సంతోషి మాట స్మరణం
రక్షా బంధన మంటేనే సంతోషి మాట స్మరణం
సంతోషి మాట స్మరణం సంతోషి మాట స్మరణం
No comments:
Post a Comment