క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మీకిని
నీరజా లయమునకు నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పరపు నీరాజనం నీరాజనం || క్షీ ||
అలివేణి తురమునకు హస్త కమలంబునకు
నిలువు మాణిక్యముల నీరాజనం
చరణ కిసలయ ములకు సకియ లంభో రులకు
నిరత మగు ముత్యేల నీరాజనం నీరాజనం || క్షీ ||
అరిధి , జఘనంబునకు అతివ, నిజ నాభి కిని
నిరతి, నానా వర్ణ నీరాజనం
నిరతి, నానా వర్ణ నీరాజనం నీరాజనం || క్షీ ||
పగటు శ్రీ వేంక టేశు పట్టపు రాణియై
నెగడు సతి కళలకు ను నీరాజనం
జగతి నలమేల్మంగ, జక్కాదన ముల కెల్ల
నిగుడు, నిజ, శోభనపు నీరాజనం నీరాజనం || క్షీ ||
No comments:
Post a Comment