కాళికవో కాపాలికవో
కాళిక వో కాపాలిక వో
కాళిక వో కాపాలిక వో
సుర భూమిక వో మా ఏలిక వో
సుర భూమిక వో మా ఏలిక వో
ఎవరై నా నీ ఎవరై నా ఎవరై నా నీ ఎవరై నా
అమ్మ వు నీవే రుద్రాణి మా అమ్మవు నీవే కల్యాణి || కా ||
నాగ బిందు వై నా ఊపిరి లో
నిత్యం పలికే “ ఓం “ కారం
బీజ మంత్ర మై నా ప్రాణము లో
నీవే నమ్మా ఆధారం
నిన్ను నమ్మినా వారి కెన్నడూ
నిన్ను నమ్మినా వారి కెన్నడూ
లేదు లేదమ్మా - ఏ భయమూ
నీవు తోడై నీడ నుండగా
లేదు లేదమ్మా పరాజయం
లేదు లేదమ్మా పరాజయం
జయ జయ జయ జయ జగన్నాయికా
స్వర ప్రియ శివ ప్రియ జగన్మాతృకా ….
స్వర ప్రియ శివ ప్రియ జగన్మాతృకా ….
ఎవరై నా నీ ఎవరై నా ఎవరై నా నీ ఎవరై నా
అమ్మ వు నీవే రుద్రాణి మా అమ్మవు నీవే కల్యాణి || కా ||
వేదం భూమిలో అది శక్తిగా అవతరించినది నీ రూపం
ప్రాణి కోటికే జీవ శక్తిగా ఆత్మ వెలిగినది ఆ దీపం
జన్మ జన్మ లా భవము తీరగా
సన్ను తించ గా ప్రతి క్షణం
మమ్ము దీవించి వరము లీయగా
వేడు కొందును నిరంతరం
జయ జయ జయ జయ భువన పాలికా
భవహర శుభకర సృష్టి పాలికా || కా |
No comments:
Post a Comment