కామ కోటి పీఠ కామాక్షీ నివాసినీ మామవ
కామాక్షి కామ కోటి పీఠ నివాసినీ మామవ
కౌమారీ కుసుమ ధృతి హేమాంబరా భూషిణీ
సమస్త సామ్రాజ్య దాయిని సద్గురు గుహ జననీ || కా ||
కమలేశ సోదరీ కమలాక్ష నారాయణీ
నాద బిందు కలా స్వరూపిణీ కాత్యాయినీ
కామ కళా ప్రదర్శినీ కళ్యాణ గుణ శాలినీ || కా ||
No comments:
Post a Comment