అమ్మా జగదీశ్వరీ దుర్గా పరమేశ్వరీ
అమ్మ జగదీశ్వరీ దుర్గా పరమేశ్వరీ
అమ్మ జగదీశ్వరీ దుర్గా పరమేశ్వరీ
భక్తుల నేలే భాగ్యము నీవే అని నమ్మితి మమ్మా 2
అమ్మా మమతను చూపమ్మా
మా కలతలు తీర్చమ్మా || అ || 2
అన్యము పుణ్యము ఎరుగని మేమూ
అన్నిటి నిన్నే చూస్తున్నాము 2
అన్నీ నీ వని, నీవే దిక్కని 2
అన్నీ నీ వని, నీవే దిక్కని
నీ చరణము, శరణ మన్నామూ అమ్మా || అ || 1
మనసున, మల్లెల మంటప మందూ
నెలకొనవమ్మా కరుణా సింధూ 2
నానా రీతిగా నిను పూజించగా 2
నానా రీతిగా నిను పూజించగా
మా జన్మమే ధన్య మొందగా అమ్మా || అ || 1
నీ వడిలో పసి కందులమూ
కోరితిమీ నీ ఆలంబనమూ 3
నీవే అమ్మగా నీవే నీనాన్నగా
ప్రేమతో ఆలించ వమ్మా అమ్మా || అ || 1
అమ్మ జగదీశ్వరీ దుర్గా పరమేశ్వరీ
భక్తుల నేలే భాగ్యము నీవే అని నమ్మితి మమ్మా 2
అమ్మా మమతను చూపమ్మా
మా కలతలు తీర్చమ్మా
No comments:
Post a Comment