దేవీ లలితాంబికా
దేవీ లలితాంబికా లాలించు కన్నా తల్లిగా || దే ||
మమత నిండిన మాతృ మూర్తీ
అమృతేశ్వరీ పరమేశ్వరీ || దే ||
కంచి లోన కామాక్షివీ కాశీలో విశాలాక్షివే
మధుర లోన మీనాక్షివే చాముండేశ్వరీ
నీవు లేని తావు లేదూ , నీవు కానీ ఏది లేదూ
చరాచరము నూవ్వే నమ్మా లోకేశ్వరీ
లలితా పరమేశ్వరీ || దే ||
సకల శక్తి రూపిణి నీవే
సకల సౌభాగ్య సంధాయిని నీవే
కారుణ్య ధాయిని నీవై ఉద్ధరించవే
లలితా మమ్ము కావవే || దే ||
గుణ దోషము అన్నీ మాపీ - అమ్మా
లలితా అమ్మా
గుణ దోషము అన్నీ మాపీ మనసున నిన్నే నిలిపి
మా బ్రతుకులూ చక్క దిద్దవే
చక్రేశ్వరీ లలితా త్రిపుర సుందరీ
అమ్మా అమ్మా లాలితాంబికే
దేవీ లలితాంబికా లాలించు కన్నా తల్లిగా
మమత నిండిన మాతృ మూర్తీ
అమృతేశ్వరీ పరమేశ్వరీ || దే ||
No comments:
Post a Comment