అలు మేలు మంగ నీ అభినవ రూపము
అలు మేలు మంగ నీ అభినవ రూపము
జలజాక్షు కన్నులకు చవ లిచ్చే వమ్మా || ఆ ||
గరుడా చలా ధీశు ఘన వక్ష మున నుండి
పరమా నంద సంభరితవై
నెర తనములు చూపి నిరంతరము నాధుని
హరు షించగ జేసితి గద వమ్మా || ఆ ||
శశి కిరణము లకు చలువల చూపులు
విశదముగా మీద వేద జెల్లుచు
రసికత పెంపున గరగించి యెప్పుడు నీ
వశము చేసి కొంటి వల్లదు నో యమ్మా || ఆ ||
రట్టడి , శ్రీ వేంకట రాయ నికి, నీవు
పట్టపు రాణి వై పరు గుచు వచ్చి
మాకు తిరగించు వలపు మాటలు విభు
జెట్టి గొని పురమున సతత మైతి వమ్మా || ఆ ||
No comments:
Post a Comment