మేలుకో ఎల్లమ్మ మేలుకోవే
మేలుకో ఎల్లమ్మ మేలుకోవే ......
మేలుకొని ఎల్లమ్మ మమ్మేలుకోవే ...... || మే ||
ఆషాడ వచ్చింది ఎల్లమ్మా
నీకు అభిషేకం చేయాలి రావమ్మా || మే ||
పాలు, పెరుగు తెచ్చినాము మేలుకో మేలుకో
పళ్ళు, తేనే తెచ్చినాము మేలుకో మేలుకో
పంచామృతం చేసి అభిషేకం చేస్తాము
జనమేలే ఎల్లమ్మ మేలుకో మేలుకో || మే ||
పట్టు చీర తెచ్చినాము ముట్టుకో ముట్టుకో
ముత్యాల ముక్కు పోగు తీసుకో తీసుకో
మండుతున్న సూర్యున్ని, నుదుట బొట్టు పెట్టుకో
ముక్కంటి ముద్దు బిడ్డ ముక్కంటిని ఏలుకో ఏలుకో || మే ||
శివ శక్తు లూగంగ మేలుకో మేలుకో
భూత రాజు లాడంగ చూసిపో చూసిపో
గుగ్గిలను మైసాచి పొగలు మేము వేయగా
అయ్యా వారు బాలకృష్ణ ఆరతలు ఇయ్యంగ || మే ||